IPOs: ఈ వారం స్టాక్ మార్కెట్లలో తొమ్మిది ఐపీఓలు

by S Gopi |
IPOs: ఈ వారం స్టాక్ మార్కెట్లలో తొమ్మిది ఐపీఓలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లలో ఈ వారం మరోసారి ఐపీఓల సందడి మొదలుకానుంది. తొమ్మిది కంపెనీ రూ. 10,985 కోట్ల నిధులను సమీకరించనున్నాయి. ఇవి కాకుండా వాహన తయారీ దిగ్గజం హ్యూండాయ్ మోటార్ ఇండియాతో పాటు మరో రెండు కంపెనీలు మార్కెట్లలో లిస్టింగ్ కానున్నాయి. మార్కెట్లలో ఎంట్రీ ఇవ్వనున్న కంపెనీల్లో సోలార్ ప్యానెల్ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్ రూ. 4,321 కోట్ల వరకు సమీకరించనుంది. నిర్మాణ సంస్థ దీపక్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ సైతం రూ. 260 కోట్ల వరకు నిధులు సేకరించనుంది. ఇథనాల్ తయారీ సంస్థ గోదావరి బయో ఫైనరీ రూ. 555 కోట్లు, మరో నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రా రూ. 5,430 కోట్లు, ఎస్ఎంఈ విభాగంలో ప్రీమియం ప్లాస్ట్ రూ. 26 కోట్లు, ట్రాన్స్‌ఫార్మర్స్ తయారీ కంపెనీ డానిష్ పవర్ రూ. 197.90 కోట్లు, హీట్ ఎక్స్ఛేంజర్లు, ప్రెషర్ వెసల్స్, ప్రాసెస్ ఫ్లో స్కిడ్స్ తయారీ కంపెనీ యునైటెడ్ హీట్ ట్రాన్స్‌ఫర్ రూ. 30 కోట్లు, ప్రెసిషన్ మెటల్ కాంపోనెంట్స్ కంపెనీ ఓబీఎస్‌సీ పర్ఫెస్ఖన్ రూ. 66 కోట్లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఉషా ఫైనాన్షియల్ రూ. 98.45 కోట్లు సమీకరించనున్నాయి. లిస్టింగ్ జాబితాలో హ్యూండాయ్, లక్ష్య పవర్‌టెక్, ఫ్రెషరా ఆగ్రో ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలున్నాయి.

Advertisement

Next Story