Vishwa Karthikeya: కార్తికేయ కొత్త సినిమా స్టార్ట్.. క్లాప్ కొట్టిన సుమన్

by sudharani |
Vishwa Karthikeya: కార్తికేయ కొత్త సినిమా స్టార్ట్.. క్లాప్ కొట్టిన సుమన్
X

దిశ, సినిమా: ‘కలియుగం పట్ణణంలో’ సినిమాతో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వ కార్తికేయ.. ఇప్పుడు ఈయన మరో చిత్రానికి సిద్ధం అయ్యాడు. విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయుషి పటేల్ (Ayushi Patel) జంటగా నటిస్తున్న ఈ మూవీని తాజాగా.. గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అమరావతి టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు పి.చలపతి దర్శకత్వం వహించాడు. ఇందులో విశ్వ కార్తికేయ సరసన ఆయుషి పటేల్ నటించనుంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ హీరో సుమన్ (Suman) క్లాప్ కొట్టారు. సీనియర్ డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ (Kashi Vishwanath) గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ చంద్ర మహేష్ (Chandra Mahesh) కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. సీనియర్ దర్శకులు సముద్ర, సి.ఎల్. శ్రీనివాస్, కోటిబాబు స్క్రిప్ట్‌ను అందించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.

Next Story

Most Viewed