- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్త్రీలకు తక్కువ వేతనమే లింగ వివక్షకు బెస్ట్ ఎగ్జాంపుల్ : విద్య
దిశ, సినిమా : ఫిల్మ్ ఇండస్ట్రీలో లింగ వివక్ష, రెమ్యూనరేషన్‌లో వ్యత్యాసంపై సీనియర్ నటి విద్యాబాలన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల ఫ్యాన్స్‌తో ఆన్‌లైన్‌లో నిర్వహించిన 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌లో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఏ విషయాన్నైనా ఫిల్టర్ చేయకుండా చెప్పేస్తానన్న విద్య.. సమాజంలో కొనసాగుతున్న మూస పద్ధతులను బద్దలు కొట్టాల్సిన అవసరముందని చెప్పింది. అలాగే పురుషులతో పోలిస్తే మహిళలకు తక్కువ వేతనం ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తూ, దీనికి ఫిల్మ్ మేకర్స్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. స్త్రీలు వివాహానంతరం ఉద్యోగం చేసేది సమాజ మేలు కోసమేనని, ఇది భవిష్యత్ తరాల అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పింది. గృహిణిగా ఉంటూ బిడ్డను పెంచడం కూడా గొప్ప అనుభూతిగా పేర్కొంది. ఇక తన భర్త సిద్ధార్థ్ ఇంటి పనిలో తనకు సాయపడతాడన్న బ్యూటీ.. 'మనం ఒక్కసారే జీవించి ఒక్కసారే మరణిస్తాం. కాబట్టి ఏ పనినైనా ఇప్పుడు చేయలేకపోతే ఎప్పటికీ చేయలేం' అంటూ హితబోధ చేసింది.