ఆ నిర్మాత చేసిన పనికి ఆరు నెలలు అద్దంలో చూసుకోలేదు.. స్టార్ నటి

by Satheesh |
ఆ నిర్మాత చేసిన పనికి ఆరు నెలలు అద్దంలో చూసుకోలేదు.. స్టార్ నటి
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటి, హాట్ బ్యూటీ విద్యాబాలన్ తన నటనతోనే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ తన కెరీర్ మాత్రం అందరూ అనుకున్నంత సాఫీగా సాగలేదని, ఎన్నో కష్టాలు దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నానని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'నేను సినిమాల్లో బోల్డ్ సీన్లు చేసిన కారణంగా చాలామంది నిర్మాతలు నాతో దారుణంగా ప్రవర్తించారు. ఒక దశలో ఇండస్ట్రీలోని కొంతమంది పురుషులను చూస్తేనే అసహ్యమేసేది. ఈ క్రమంలో అణకువగా ఉండలేదని దాదాపు 13 సినిమాల నుంచి తీసివేశారు. అప్పుడు తమ ప్రాజెక్టుల నుంచి తప్పించినవారే మళ్లీ ఇప్పుడు కాల్ చేసి సినిమాలు చేయమని అడుగుతున్నారు' అంటూ చెప్పుకొచ్చింది. అయితే, వారి ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నట్లు చెప్పిన విద్య.. ఓ ప్రముఖ వ్యక్తి చేసిన పనికి ఆర్నెళ్ల పాటు అద్దంలో ముఖం చూసుకునే ధైర్యం చేయలేకపోయానని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed