- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana News: ఆ మంత్రి ఎవడాడు.. అదేమన్న వాడత్త సొమ్మా.. వాడబ్బా సొమ్మా?
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళా నాయకురాలు రాష్ట్ర మంత్రిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రశ్నల వర్షం కురిపిస్తూ మంత్రిని నిలదీసింది. రైతుల పక్షాన పోరాటం చేస్తాం.. కేసీఆర్ ను నిలదీస్తామంటూ వ్యాఖ్యనించింది. ఆ వీడియో ఏంటి.. ఆ మహిళా నాయకురాలు ఎవరు..? ఆ మంత్రి ఎవరు.. ఎందుకు నీలదీసింది అనేది తెలియాలంటే. ఈ వార్తను చదవండి. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడింది. రైతులు నల్లా జెండాలతో కేంద్రంపై పోరాటం చేయకుంటే రైతు బంధు కట్ చేస్తామంటాడా అంటూ ఖండించింది.
'ఆ మంత్రి ఎవడు.. ఎర్రబెల్లి దయాకర్ రావు అంటా. అంటాడు మీరు గనుక బీజేపీకి వ్యతిరేకంగా నల్లా జెండాలతో పోరాటం చేయకపోతే రైతు బంధు కట్ చేస్తడంట. వాడత్త సొమ్మా.. వాడబ్బా సొమ్మా.. ఎవడి సొమ్మని కట్ చేస్తాడు? పైసా పైసా తెలంగాణ ప్రజల హక్కు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇంతవరకు వీళ్ల ఇష్టానుసారం రూ. లక్షల కోట్లు అప్పు చేసి.. ఆ అప్పంతా కమీషన్ల రూపంలో వాళ్లు మింగేసి ఈరోజు తెలంగాణ ప్రజల నెత్తిన రూ. 4 లక్షల కోట్లు అప్పు పెట్టారు. ఎంత పొగరు.. ఎంత మదం కాకపోతే రైతు బంధు కట్ చేస్తానంటాడా? ఇదేమన్న ప్రజాస్వామ్యమా.. ఆఫ్ఘానిస్తానా? వాళ్లేమన్న తాలిబన్లా?.. ఆలోచన ఉండే మాట్లాడుతున్నారా.. సోయి ఉండే మాట్లాడుతున్నారా.. బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా.. ఇంగితం ఉండి మాట్లాడుతున్నారా ?. తప్పు వాళ్లు చేసి సంతకం వాళ్లు పెట్టి రైతులు ధర్నా చేయాలంట.. కేంద్రం మీద చేయాలంట. అసలు ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు అనే మనిషికి ఇంగితం ఉంటే సోయి ఉంటే.. అసలు మనిషైతే కేసీఆర్ మీద ధర్నా చేయాలి. సంతకం పెట్టింది కేసీఆర్ అయితే ఎవరి మీద ధర్నా చేయాలా?. అసలు ఎవరిని అడిగి సంతకం పెట్టావని కేసీఆర్ ను ప్రజలందరూ, మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ నిలదీయాలి. మరొక్కసారి చెబుతున్నాం.. వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చేంతవరకు రైతుల పక్షాన మేం నిలబడుతాం.. రైతుల పక్షాన పోరాటం చేస్తాం' అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో ఎర్రబెల్లి, సీఎం కేసీఆర్ పై మండిపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది.