Viral Video: యాక్.. తూ.. కుక్క మూతి నాకిన స్టార్ హీరో

by samatah |   ( Updated:2022-04-07 11:36:39.0  )
Viral Video: యాక్.. తూ.. కుక్క మూతి నాకిన స్టార్ హీరో
X

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సరదాగా చేసిన పని నెటిజన్లకు వాంతులు తెప్పిస్తోంది. తన పర్సనల్ విషయాలను రెగ్యులర్‌గా అభిమానులతో పంచుకునే వరుణ్.. తాజాగా తన పెట్ డాగ్ 'జోయి'తో ఆడుకుంటున్న వీడియోను నెట్టింట షేర్ చేశాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. వరుణ్ ఉదయం లేవగానే తన భార్య నటాషా దలాల్‌‌తో ముద్దులాడుతుండగా మరోవైపు కూర్చున్న కుక్క వరుణ్ పెదాలపై నాలుకతో నాకుతూ అతన్ని ఉక్కిబిక్కిరి చేసింది. ఈ నేపథ్యంలోనే 'జోయితో టైమ్ స్పెండ్ చేస్తే తక్షణమే ఒత్తిడి దూరమై ఉల్లాసంగా మారిపోతాం' అనే క్యాప్షన్‌తో వీడియో పోస్టు చేశాడు వరుణ్. దీనిపై పలువురు నెటిజన్లు 'వావ్! బ్యూటిఫుల్ క్యూట్ వీడియో' అని పాజిటివ్‌గా స్పందిస్తుండగా.. మరికొందరు మాత్రం 'చీ! యాక్.. ఇదేం పని, చూస్తేనే వాంతికి వస్తోంది' అంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story