- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రణ్‌వీర్ న్యూడిటీపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్ నెట్టింట దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే టాపిక్‌పై చర్చ నడుస్తుండగా.. ఫిల్మ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ఈ విషయంపై స్పందిస్తున్నారు. రీసెంట్ ఆలియా భట్ మాట్లాడుతూ.. 'నా అభిమాన హీరో రణ్‌వీర్ గురించి నెగెటివ్‌గా మాట్లాడటం నాకు ఇష్టముండదు. అలాంటి ప్రశ్నను నేను అస్సలు సహించలేను. రణ్‌వీర్ నటుడిగానే కాదు వ్యక్తిగతంగానూ ప్రతి ఒక్కరికి నచ్చిన వ్యక్తి. కాబట్టి మనం అతనికి ప్రేమను మాత్రమే ఇవ్వాలి' అంటూ రణ్‌వీర్‌కు మద్దతు తెలిపింది. ఇదిలా ఉంటే.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఈ ఇష్యూపై స్పందించారు. మహిళలు తమ శరీరాన్ని చూపించినప్పుడు మగాళ్లు ఎందుకు చూపించకూడదని ప్రశ్నించారు. మొత్తానికి రణ్‌వీర్ చేసిన బోల్డ్ అటెంప్ట్ క్షణాల్లో ట్రెండ్ అవ్వడమే కాక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ క్రమంలోనే కొందరు అతని ప్రయత్నాన్ని ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.
I personally applaud and I am also thrilled to see the majority applauding @RanveerOfficial 's new age boldness💪💪💪 ..and I hope that the same majority will applaud a woman as much if she does the same ..There has to be a GENDER EQUALITY 💐💐💐 pic.twitter.com/9kVGMrYro1
— Ram Gopal Varma (@RGVzoomin) July 26, 2022