వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌కు కొవిడ్ పాజిటివ్..

by Manoj |
వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌కు కొవిడ్ పాజిటివ్..
X

దిశ, సినిమా : సౌత్ ఇండస్ట్రీలో లేడి విల‌న్‌గానే కాక డిఫరెంట్ రోల్స్ చేస్తున్న వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ కొవిడ్ బారిన పడింది. తెలుగులో ప్రస్తుతం 'య‌శోద, హనుమాన్' చిత్రాలతో పాటు బాల‌కృష్ణ 107వ సినిమాలోనూ నటిస్తున్న ఆమె.. మాస్క్ ధ‌రించ‌డం సహా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ క‌రోనా సోకిన‌ట్లు చెప్పింది.

కొవిడ్ పూర్తిగా తొల‌గిపోలేద‌ని, అంద‌రూ త‌ప్పకుండా మాస్క్ ధ‌రించాల‌ని తెలిపింది. న‌టీన‌టుల‌కు షూటింగ్స్‌లో మాస్క్‌తో న‌టించ‌డం కుద‌ర‌ద‌ు కనుక, వారు సేఫ్‌గా ఉండాలంటే మిగిలిన యూనిట్ స‌భ్యులు విధిగా మాస్క్ ధ‌రిస్తే బాగుంటుంద‌ని ట్విట్టర్ ద్వారా సూచించింది. అలా చేసిన‌ప్పుడే అంద‌రూ సేఫ్‌గా ఉండే అవ‌కాశం ఉంటుందని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed