- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూపీలో విద్యార్థులకు ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్ల పంపిణీ
ఉత్తరప్రదేశ్: రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినీ విద్యార్థులకు 9.74 లక్షల ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. సమాచార టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఇప్పటికే 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవలసిందిగా చెప్పామని ఉన్నతాధికారులు తెలిపారు. అధికార బీజేపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన సంకల్ప్ పత్రలో యూపీలోని 2 కోట్లమంది యువతీయువకులకు ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలనే లక్ష్యాన్ని ప్రకటించింది.
కొవిడ్-19 మహమ్మారి వల్ల గత రెండేళ్లుగా యువత విద్య దారుణంగా దెబ్బతినడమే కాకుండా వారు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లలేకపోయారు. వీరి విద్యావకాశాలు దెబ్బతినరాదనే అభిప్రాయంతో యోగి ప్రభుత్వం ఆన్ లైన్ విద్యను ప్రారంభించింది. కానీ ఆధునిక టెక్నాలజీతో పిల్లలకు పెద్దగా పరిచయం లేకపోవడం దీనికి పెద్ద ఆటంకమై కూర్చుంది. దీంతో సాంకేతికంగా సమర్థతను పెంచే లక్ష్యంతో యూపీ ప్రభుత్వం 2 కోట్ల మంది యువతకు ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది యోగి ప్రభుత్వానికి గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నారు.