లక్ష మంది ఉక్రెయిన్ శరణార్థులను అనుమతిస్తాం.. అమెరికా వైట్‌హౌస్

by Vinod kumar |
లక్ష మంది ఉక్రెయిన్ శరణార్థులను అనుమతిస్తాం.. అమెరికా వైట్‌హౌస్
X

కీవ్: ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లో అమెరికా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్ వీడుతున్న శరణార్థులను లక్ష మందిని అక్కున చేర్చుకోనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా 1 బిలియన్ డాలర్లు అదనంగా మానవత్వ సాయం కింద అందించినున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని గురువారం వైట్ హౌస్ ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఆహారం, ఆవాసం, శుద్ధ నీరు, వైద్య సరఫరాలు, ఇతర సాయం కోసం అదనపు సాయాన్ని అందించనున్నట్లు పేర్కొంది.

Advertisement

Next Story