యూపీ ప్రభుత్వ, పంజాబ్ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాక్

by Harish |
యూపీ ప్రభుత్వ, పంజాబ్ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాక్
X

న్యూఢిల్లీ: హ్యాకర్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ మరవకముందే, సోమవారం యూపీ ప్రభుత్వ, పంజాబ్ కాంగ్రెస్ అధికారిక ఖాతాలను హ్యాక్ చేశారు. రెండు ఖాతాల్లోనూ క్రిప్టోకరెన్సీ, ఎన్ఎఫ్‌టీలకు సంబంధించిన ప్రకటనలను షేర్ చేశారు. అయితే యూపీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించింది. ఇక పంజాబ్ ప్రభుత్వం కూడా ఆ పోస్టులను డిలీట్ చేసి, ప్రొఫైల్ పిక్చర్ ను పునరుద్దరించింది. వీటిలో యూపీ ప్రభుత్వ ఖాతాకు 27 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండగా, పంజాబ్ కాంగ్రెస్ ఖాతాను 1.84లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇక యూజీసీ, భారత వాతావరణ శాఖ ఖాతాలు కూడా గతంలో హ్యాకింగ్‌కు గురైన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed