ఘనపూర్ ప్రాజెక్టు‌లో గుర్తు తెలియని మహిళ శవం కలకలం

by samatah |
ఘనపూర్ ప్రాజెక్టు‌లో గుర్తు తెలియని మహిళ శవం కలకలం
X

దిశ (కొల్చారం): మెదక్ జిల్లాలో గుర్తు తెలియని మహిళ శవం కలకలం రేపింది. జిల్లాలోని ఘనపూర్ ప్రాజెక్టులో గుర్తు తెలియని మహిళ శవాన్ని గురువారం సాయంత్రం కొల్చారం పోలీసులు కనుగొన్నారు. సుమారు 45 సంవత్సరాలు వయసు మహిళ శవం ఘనపూర్ ప్రాజెక్టు మెకానికల్ వంతెన సమీపంలో ప్రాజెక్టులోని నీటి మడుగు‌లో లభించింది. వివరాలు తెలిసినవారు కొల్చారం పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసు సిబ్బంది తెలిపారు. ఇక ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story