- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లుడికి అదిరిపోయే కట్నం ఇచ్చిన మామ!
దిశ, అదిలాబాద్: ఇటీవల కాలంలో అందరూ తమ అల్లుళ్లకు బైకులు, కార్లు, బంగారం ఇతర వస్తువులు కట్నకానుకలు భావిస్తుంటే ఇందుకు భిన్నంగా.. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసి వివాహ వేడుకల్లో ఓ మామ తన అల్లుడికి కట్నం కింద రెండు ఎద్దులు, బండి కట్నకానుకలగా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దొంగచింత గ్రామానికి చెందిన పెందూర్ లచ్చు - పారుబాయి ల కుమార్తె లింగు బాయి నీ.. ఉట్నూర్ మండలం చింతకర్ర గ్రామానికి చెందిన కుమ్ర జుగాదిరావ్ కు ఇచ్చి వివాహం జరిపించారు.
ఈ వివాహం ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. అల్లుడైన కుమ్ర జుగాధిరావ్ కు కట్నంగా రెండు జతల ఎడ్లు.. ఓ ఎడ్లబండిని అందంగా అలంకరించి తన అల్లుడు, కుమార్తెకు పెళ్లి మండపంలోనే కానుకగా ఇచ్చాడు. నూతన దంపతులు జుగాదిరావు-లింగుబాయి.. అనంతరం ఎడ్లకు పూజ చేసి ఆ బండి పైనే వధువుని మండలం చింత కర్ర లోని తమ ఇంటికి తీసుకెళ్లాడు వరుడు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు పెళ్ళిళ్ళలో ఎడ్లబండ్లను ఇవ్వడం ఓ ట్రెండ్ గా మారింది.