- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈడీ అధికారులపై దర్యాప్తునకు 'సిట్': శివసేన సర్కార్ సంచలన నిర్ణయం
ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దర్యాప్తు చేయించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలి కాలంలో కొందరు ఈడీ అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్ సర్కార్ సిట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దిలీప్ వాల్షే పాటిల్ మీడియాతో మాట్లాడుతూ వీరేష్ ప్రభు అనే అధికారి నేతృత్వంలో సిట్ పని చేస్తుందన్నారు. నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సిట్ బృందాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నలుగురు ఈడీ అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో దీనిపై ముంబై పోలీసులు దర్యాప్తు జరుపనున్నారని, వీరిలో కొందరు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందని స్పష్టంచేశారు. కాగా, మనీలాండరింగ్ కేసులో సోమవారం శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు సంబంధించిన రూ.1,034 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.