- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయుధాలు కల్గి ఉన్న యువకులు అరెస్ట్.. కీలక వివరాలు వెల్లడించిన ఏసీపీ
దిశ, కారేపల్లి: చట్ట విరుద్దంగా ఆయుధాలు కల్గి ఉన్న యువకులను అరెస్టు చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్ననట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు. బుధవారం కారేపల్లి పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కారేపల్లి ఎస్సై కుశకుమార్ శాంతినగర్ క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సంపత్ అనే యువకుడు అనుమానస్పదంగా కనిపించాడు. అతడి వద్ద తనిఖీ చేయగా.. రైఫిల్ లభించినట్లు తెలిపారు.
అతడిని విచారింగా టేకులగూడెం గ్రామానికి చెందిన ప్రమోద్ నుండి దానిని తీసుకున్నట్లు పేర్కొన్నాడు. పోలీసులు ప్రమోదును విచారించగా.. తమ తాత ఇంటికి ఎన్డీ దళం సభ్యులు వచ్చే క్రమంలో ఆయుధాలు వారి ఇంట్లో ఉంచేవారని చెప్పాడు. సంపత్ నుంచి ఒక రివాల్వర్, ప్రమోద్ నుంచి పాయింట్ 303 రైఫిల్‌కు చెందిన 13 రౌండ్స్ బుల్లెట్లు, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌కు రౌండ్ బుల్లెట్, రెండు రౌండ్ల 9ఎంఎం పిస్టల్ బుల్లెట్లు, 13 డిటోనేటర్లు లభించినట్లు ఏసీపీ తెలిపారు. దీనికి సంబంధించి సంపత్, ప్రమోద్, అనిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.