వాటిని అక్రమంగా తయారు చేస్తున్నందుకు.. ఇద్దరు మహిళలకు జరిమానా

by Vinod kumar |
వాటిని అక్రమంగా తయారు చేస్తున్నందుకు.. ఇద్దరు మహిళలకు జరిమానా
X

దిశ, కారేపల్లి: గుడుంబా కేసులో ఇద్దరు మహిళలకు ఎక్సైజ్ అధికారులు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే.. అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న మహిళలకు సింగరేణి ఎక్సైజ్‌ సీఐ జూల్పికర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున రూ.2 లక్షలను జరిమానా విధించారు. గుంపెళ్ళగూడెం గ్రామానికి ఇద్దరు మహిళలను మంగళవారం తహశీల్ధార్‌ కోట రవికుమార్‌ ఎదుట హాజరుపర్చగా.. వారికి జరిమానా తో పాటు బైండోవర్‌ కేసును నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రబ్బాని, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story