Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్.. రెండు రోజులు బ్యాంకులు బంద్

by samatah |   ( Updated:2022-04-14 06:36:15.0  )
Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్.. రెండు రోజులు బ్యాంకులు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. బ్యాంకులో మీకు అత్యవసరమైన పని ఉందా ? రేపు వర్క్ చేసుకుందాంలే అని ఏదైనా బ్యాంకు పనిని వాయిదావేస్తున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం. వెంటనే ముఖ్యమైన పనిని శనివారం రోజునా, కంప్లీట్ చేసుకోండి. ఎందుకు అనుకుంటున్నారా ? బ్యాంకు తమ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు, రేపు (14,15) తేదీల్లో బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. నేడు అంబేడ్కర్ జయంతి, రేపు గుడ్ ఫ్రైడే కారణంగా ప్రభుత్వ కార్యాలయాలతోపాటు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ రెండు రోజులు బ్యాంకు సేవలకు ఆటకం కలగనుంది. తిరిగి శనివారం బ్యాంకులు ఓపెన్ కానున్నందున ఆరోజు బ్యాంకు పనులు పూర్తి చేసుకోగలరు. ఎందుకంటే ఆదివారం మళ్లీ బ్యాంకులకు సెలవు కాబట్టి.

Advertisement

Next Story