క్రికెట్ అభిమానులకు ట్విట్టర్ గుడ్‌న్యూస్.. పిట్టగూట్లో ప్రత్యేక 'క్రికెట్ ట్యాబ్'!

by Manoj |
క్రికెట్ అభిమానులకు ట్విట్టర్ గుడ్‌న్యూస్.. పిట్టగూట్లో ప్రత్యేక క్రికెట్ ట్యాబ్!
X

దిశ, ఫీచర్స్ : సోషల్ ఇష్యూస్ నుంచి అంతరిక్ష సంగతుల వరకు.. గల్లీ ఫైట్ నుంచి బడా దేశాల యుద్ధాల వరకు.. ట్విట్టర్‌ వేదికగా చర్చలకు అంతే ఉండదు. ఇలా ప్రతి అంశంలో ప్రజల మనోభావాలకు అద్దంపడుతున్న మైక్రో బ్లాగింగ్ సైట్.. క్రికెట్ లవర్స్‌కు సైతం ప్రత్యేక అడ్డాగా మారిపోయింది. ఏడాది కాలంలోనే (జనవరి 2021 - జనవరి 2022) 4.4 మిలియన్ ఇండియన్స్ క్రికెట్ గురించి 96.2 మిలియన్ ట్వీట్లను ట్విట్టర్‌లో పంచుకున్నారంటేనే ఈ ప్లాట్‌ఫామ్‌లో ఆ గేమ్‌ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు 75 శాతం భారతీయ ట్విట్టర్ యూజర్లు క్రికెట్ అభిమానులేనని సర్వేలో వెల్లడికాగా.. వారి కోసం ప్రత్యేకంగా 'క్రికెట్ ట్యాబ్'‌ ప్రవేశపెడుతోంది ట్విట్టర్. లైవ్ స్కోర్, కామెంటరీ సహా క్రికెట్‌ సంబంధిత అంశాలను ఒకే చోట పొందేందుకు ఈ ట్యాబ్ ఉపయోగపడనుంది. ఈ ఫీచర్ గురించి మరిన్ని విశేషాలు..

ఈవెంట్స్ పేజీ: క్రికెట్ ట్యాబ్‌లో పొందుపరిచిన ఈ ప్రత్యేక పేజీలో క్రికెట్‌కు సంబంధిత లేటెస్ట్ ట్వీట్స్, అప్‌డేట్స్ పొందుతారు.

లైవ్ స్కోర్‌కార్డ్స్: ఈవెంట్స్ పేజీలో కనిపించే లైవ్ స్కోర్‌కార్డ్‌ ట్యాబ్‌లో ఎప్పటికప్పుడు మ్యాచ్ స్కోర్స్ తెలుసుకోవచ్చు.

ఇంటరాక్టివ్ టీమ్ విడ్జెట్స్ : టాప్ ప్లేయర్స్, టీమ్ ర్యాంకింగ్‌ వంటి కంటెంట్ ఇక్కడ పొందవచ్చు.

టాప్ వీడియో కంటెంట్: ప్రతీ మ్యాచ్‌లోనూ కొన్ని టర్నింగ్ మూమెంట్స్, బ్యాటింగ్ మెరుపులు, బౌలింగ్ యాక్షన్స్ ఉంటాయి. అలాంటి హెడ్ లైన్స్, ఆఫ్-ఫీల్డ్ యాక్షన్స్‌తో పాటు కస్టమైజ్డ్ వీడియో కంటెంట్‌ను ఇక్కడ లభిస్తుంది.

టాపిక్ ట్వీట్స్ : ఈ విడ్జెట్‌లో సబ్జెక్ట్ రిలేటెడ్ ట్వీట్స్ పొందవచ్చు.

ట్విట్టర్ లిస్ట్స్ : అభిమానులు తమ ఫేవరెట్ జట్లు, ఆటగాళ్లకు అంకితమైన Twitter జాబితాలను ఇక్కడ ఫాలో చేసే అవకాశముంటుంది. పర్టిక్యులర్ టాపిక్‌పై ఒపీనియన్స్ షేర్ చేసుకునేందుకు ఆయా గ్రూప్స్‌ను ఎంచుకోవచ్చు. అంతేకాదు మ్యాచ్ సమయంలో కీ-మూమెంట్స్‌కు సంబంధించిన పుష్ నోటిఫికేషన్స్ అందుకోవచ్చు.

ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, పంజాబీ, తమిళం, తెలుగు వంటి భారతీయ భాషల్లో కస్టమ్ టీమ్ ఎమోజీలను యాక్టివేట్ చేసుకోవచ్చని ట్విట్టర్ తెలిపింది.



Advertisement

Next Story