తలని శృంగారపరమైన అవయవంగా చూస్తారా?.. హిజాబ్ వివాదంపై స్టార్ నటి

by Javid Pasha |
తలని శృంగారపరమైన అవయవంగా చూస్తారా?.. హిజాబ్ వివాదంపై స్టార్ నటి
X

దిశ, సినిమా: కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదంపై బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన ట్వింకిల్.. కావాలనే కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రగా పేర్కొంది. 'బుర్ఖా, హిజాబ్‌, ఘుంగాట్‌లు వాటిని ఉద్దేశించిన పరిస్థితుల నుంచి మతపరమైన, సాంస్కృతిక అంశాలుగా మారాయి. కానీ, పురుషుల నుంచి రక్షణగా, వారిని టెంప్ట్ చేయకుండా ఉండేందుకు హిజాబ్ ఉపయోగపడుతుందని కొందరు మతవాద నాయకులు మాట్లాడుతున్నారు. ఈ భాయ్ సాబ్‌లందరూ ఈ విషయంలో సందేహాలు తీర్చాలి.

చాలా కొద్దిమంది మాత్రమే తలని శృంగారపరమైన అవయవంగా చూస్తారు. ఎప్పుడైనా మగాడు 'వావ్ ఈ రోజు మీ తల ఎంతో హాట్‌గా ఉంది' అని చెప్పాడా? దానికి ఓ మహిళ.. 'ధన్యవాదాలు డార్లింగ్ నా తలని ఈ షేప్‌లో ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాను' అని చెప్పిందా? అంటూ ప్రశ్నించిన నటి.. ప్రజలకు ప్రయోజనం లేని విషయాలపై సమయం వృథా చేస్తున్నారంటూ గట్టిగానే చురకలంటించింది.

Advertisement

Next Story