- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఆ బాధ్యత యువతదే: మంత్రి
దిశ, సిద్దిపేట: ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలుగా పార్టీ యువజన విభాగానిదే అని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం నారాయణ రావు పేట మండల యువజన విభాగం నూతన కమిటీని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మండల యువజన విభాగం అధ్యక్షునిగా నారాయణ రావుపేటకు చెందిన దీకొండ భాస్కర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాలను ప్రకటించిందని, దాదాపుగా 91 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్‌లు రానున్నట్లు ఆయన తెలిపారు. అందుకు యువత ఉద్యోగాల నోటిఫికేషన్లపై దృష్టి పెట్టాలని అన్నారు. గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువతి యువకుల్లో అవగాహన కలిపించాలని నూతన యువజన విభాగం నాయకులకు సూచించారు. కానిస్టేబుల్, ఇతర గ్రూప్స్‌తో సహా అన్ని పోటీ పరీక్షలకు త్వరలోనే సిద్దిపేటలో ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టనున్నామని మంత్రి చెప్పారు.
సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 91 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో బీజేపీ వారు బిత్తర పోయారన్నారు. ఎంత సేపు నిరుద్యోగుల పట్ల వాళ్ళకే ప్రేమ ఉన్నట్టు అబద్దపు ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. కేంద్రం పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ సంగతి వీరెందుకు మాట్లాడరని ప్రశ్నించారు. విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. సిద్దిపేటలో రెండు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని, దేశము గర్వించే పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్నామని చెప్పారు. ప్రజల్లో ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలు చేరవేసే బాధ్యత యువతదే అని చెప్పారు. గతంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇప్పుడు ఎన్ని ఇచ్చాము అనేది నిరుద్యోగ యువకుల్లో అవగాహన కల్పించాలన్నారు.
కానిస్టేబుల్ పోస్టులకు ఉచిత శిక్షణ తీసుకునేందుకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని, అందుకు https://forms.gle/sFsphN7jXeE7xc5z6 లో ఆన్‌లైన్ చేస్కోవాలని తెలిపారు. ఈ అప్లికేషన్‌కు గురువారం చివరి రోజు అని ఔత్సాహికులు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరలో అన్ని పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామని చెప్పారు. యువకుల కోసం ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేయాలని అదే సమయంలో బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు.