- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడికి 'దళితబంధు'.. నెట్టింట్లో వైరల్‌గా రూ.100 వ్యవహారం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి, వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశ్యంతో దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన దళితులకు రూ.10 లక్షలు అందిస్తోంది. అయితే, ముందుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అర్హులైన మొదటి 100 మందికి రూ.10 లక్షల చొప్పున అందించేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అర్హుల జాబితాను ప్రిపేర్ చేయాలని ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వగా.. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డా.రాజయ్య చేసిన నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన సొంత తమ్ముడికి 'దళితబంధు' ఇచ్చేందుకు సిద్ధమై లిస్ట్ ప్రిపేర్ చేసినట్లు సమాచారం. అది కాస్తా బయటకు పొక్కడంతో లిస్టులోనుంచి ఆయన తమ్ముడి పేరును తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో రాజయ్యపై గతంలో వచ్చిన ఆరోపణలు లేవనెత్తుతూ ట్వీట్లు చేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ''తిరుపతి దర్శనం కోసం లెటర్ అడిగితే రూ.100 రూపాలు తీసుకొని ఎమ్మెల్యే రాజయ్య ఇస్తాడని భారీ బహిరంగ సభలో ప్రత్యర్థి పార్టీ వాళ్ళు చెప్పారు. అటువంటిది దళితబంధు ఎట్లా వదిలిపెడతాడు రా మా మాస్ రాజన్న. ఎమ్మెల్యే పేరు కూడా ఉండాలే సరిగా చూడలే లిస్ట్ మొత్తం.'' అని విమర్శించారు. దీంతో రూ.100 వ్యవహారంపై నెట్టింట చర్చ జరుగుతోంది.