- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదివాసీల పోరుబాట.. తాగునీరు కోసం పాదయాత్ర
దిశ, ఖానాపూర్: దశబ్దాలు గడుస్తున్నా ఆదివాసీ గిరిజన బిడ్డల బతుకులు ఎడారిగానే ఉండిపోతున్నాయి. తాగటానికి తాగు నీరు లేక వారు పడే బాధలు అంతా ఇంతా కాదు. చివరకు వారికి చెలమ నీరే శరణ్యంగా ఉంది అడవిబిడ్డల పరిస్థితి. విద్యుత్, రోడ్లు లేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న వారికి, ఆ సమస్యలను పరిష్కరించే నాధులే కరువయ్యారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాలలో.. వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మండలంలోని చాకిరేవు, నాయక్ పోడ్ గూడ, దొందరి, హరిచందన్, 72కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేపట్టారు. గిరిజనుల సమస్యలు తీర్చాలని చాకిరేవు గ్రామం నుంచి 72కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా పాలనాధికారి కార్యాలయానికి ఆదివాసీ గిరిజన బిడ్డలు మండుటెను కూడా లెక్కచేయకుండా పాదయాత్ర చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తోడసం శంభు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వారికి మద్దతుగా బీజేపీ నాయకులు ఐదు వెంకటేష్,పొద్దుటూరి గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.