Bigg Boss 8 Telugu: హౌస్‌లో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు.. పృథ్వీకి యష్మీ ఇన్‌డైరెక్ట్ ప్రపోజల్.. అతడి రియాక్షనిదే?

by Anjali |
Bigg Boss 8 Telugu: హౌస్‌లో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు.. పృథ్వీకి యష్మీ ఇన్‌డైరెక్ట్ ప్రపోజల్.. అతడి రియాక్షనిదే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 (Bigg Boss 8 Telugu) లో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు నడుస్తున్నాయి. ఈ రకపు ప్రేమ కథలు ప్రతి సీజన్‌లో చూస్తూనే ఉన్నాం. కానీ ఈ సీజన్‌లో మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోనియా(Sonia) ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లకముందు నిఖిల్‌(Nikhil)తో ప్రేమాయణం కొనసాగించిందని నెటిజన్ల టాక్. తర్వాత నిఖిల్, యష్మీ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందన్నారు. ఇప్పుడు యష్మీ(Yashmi) పృథ్వీతో క్లోజ్ గా మూవ్ అవుతుంటే బిగ్ బాస్ ప్రేక్షకులు కన్ఫూజన్ తో తలలు పట్టుకుంటున్నారు. తాజా ఎపిసోడ్‌లో యష్మీ.. నిఖిల్ ముందే పృథ్వీ(prudhvi)కి పరోక్షంగా లవ్ ప్రపోజ్ చేసింది. అబ్బాయిలంతా టాస్కులో భాగంగా క్లీన్ షేవ్ చేసుకున్న విషయం తెలిసిందే.

కానీ పృథ్వీ మాత్రం షేవ్ చేసుకోలేదు. నిఖిల్ గడ్డం తీయకముందు కాస్త గ్రీన్ ఫ్లాన్ లా ఉండేవాడని.. కానీ ఇప్పుడు కంప్లీట్ గా రెడ్ ఫ్లాగ్ లా మారిపోయావని యష్మీ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇక పృథ్వీని.. నువ్వు గడ్డం తీయనందుకు నీకు పడిపోయేలా ఉన్నానని సిగ్గుపడుతూ ఉంటుంది. దీంతో వెంటనే నిఖిల్ స్పందించి.. ఈ మాట కనుక విష్ణుప్రియ(Vishnu Priya) ముందు అంటే అర్థరాత్రి నిన్ను మర్డర్ చేస్తుందంటాడు నిఖిల్ ఘాటుగా. మొన్నటివరకు నిఖిల్.. ఇప్పుడు పృథ్వీతో ఏంటని యష్మీపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story