- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో సొంతంగా వాహనాల స్టార్ రేటింగ్ విధానం!
న్యూఢిల్లీ: కార్ల ప్రమాదాలకు సంబంధించి వినియోగదారుల భద్రతను అంచనా వేసేందుకు రవాణా మంత్రిత్వ శాఖ స్టార్ రేటింగ్ విధానాన్ని తీసుకురానుంది. ఈ మేరకు భారత్ ఎన్‌సీఏపీ(న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్)ను ప్రవేశపెట్టేందుకు నోటిఫికేషన్, క్రాష్ టెస్టులలో పనితీరును బట్టి భారత్‌లో వాహనాలకు స్టార్ రేటింగ్‌లు ఇవ్వనున్నట్టూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ తెలిపారు. దీనివల్ల దేశీయంగా వాహనాల తయారీ కంపెనీల మధ్య మెరుగైన, ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కార్లలో తయారీ, వినియోగదారుల భద్రతను మాత్రమే కాకుండా భారత్ నుంచి ఇతర మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు ఈ కొత్త విధానం వల్ల కీలకం కానుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, గ్లోబల్ క్రాష్ టెస్ట్‌లకు అనుగుణంగానే భారత ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లు జరుగుతాయని, ఈ కొత్త రేటింగ్ విధానం ద్వారా భారతీయ వాహన పరిశ్రమ మరింత సమర్థవంతంగా స్వయం సమృద్ధి సాధించగలదనే నమ్మకం ఉందని నితిన్ గడ్కరీ వెల్లడించారు.