ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత

by Kavitha |   ( Updated:2024-10-17 14:59:19.0  )
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత
X

దిశ, సినిమా: అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సింగర్ లియామ్ ఫెయినే కన్నుమూశాడు. అర్జెంటీనా లోని ఓ హోటల్ మూడో అంతస్తు నుంచి కిందపడి అతను మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఓ హోటల్ వెనకవైపు పెద్ద శబ్దం రావడంతో సిబ్బంది వెళ్లి చూడగా.. ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇక హుట హుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. అసలు చనిపోయింది ఎవరా అని ఆరా తీయగా బ్రిటిష్ బాయ్ బ్యాండ్ వన్ డైరెక్షన్ మాజీ సింగర్ అని తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed