- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Puvvada Ajay Kumar: 'వచ్చే ఎన్నికల్లో మంత్రి పువ్వాడను బహిష్కరించండి'
Minister Puvvada Ajay Kumar
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అక్రమాలపై సీబీఐ విచారణ జరుపాలని టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి పువ్వాడ అజయ్ అనేక అక్రమాలు చేశాడని ఆరోపించారు. దమ్ముంటే పువ్వాడ అజయే సీబీఐకి వివరణ ఇవ్వాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో చనిపోయిన రైతు కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉటుందని అన్నారు. రైతులు పండించిన మిర్చీకి గిట్టుబాటు ధరలేకపోతే.. రైతులకు బేడీలు వేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి పువ్వాడను ఖమ్మం ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పీడీ కేసుల వల్ల చనిపోయిన కార్యకర్తలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే మసైపోతావ్ అని హెచ్చరించారు.