యవ్వనంగా కనిపించేందుకు పిట్ట రెట్ట వాడుతున్న హీరో ..

by Manoj |
యవ్వనంగా కనిపించేందుకు పిట్ట రెట్ట వాడుతున్న హీరో ..
X

దిశ, సినిమా : సినీ స్టార్స్ అందంగా కనిపించినంత కాలమే వెండితెరపై మెరిసే చాన్స్ ఉంటుంది. అందుకే బ్యూటీని కాపాడుకునేందుకు, ఏజ్‌తో సంబంధం లేకుండా యంగ్‌గా కనిపించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే 58 ఏళ్ల హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ 30 ఏళ్ల కుర్రాడిలా కనిపించేందుకు పిట్ట రెట్ట వాడుతుండటం విశేషం. విషయానికొస్తే.. గీషా ఫేషియల్‌లో కోకిల రెట్ట పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఈ పౌడర్‌ను ముఖంపై అప్లయ్ చేశాక.. దానిపై బియ్యం ఊకను కోట్ చేస్తాడట. ఈ ప్రక్రియ శరీరాన్ని శుభ్రపరిచి యవ్వనంగా కనిపించేలా చేస్తుందని తెలిపాడు టామ్ క్రూజ్. కాగా పిట్ట రెట్ట ధర రూ.14,000 కావడం గమనార్హం.

Advertisement

Next Story