- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కండోమ్ కంపెనీపై కేసు పెట్టిన టాలీవుడ్ హీరో సుహాస్.. (వీడియో)
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే సుహాస్ నటించిన సినిమాలు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం, శ్రీరంగ నీతులు, గొర్రె పురాణం ఇదే ఏడాదిలో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ప్రజెంట్ సుహాస్ ‘జనక అయితే గనక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే దీనిని సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కిస్తుండగా.. దిల్‌రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదల కాబోతుంది.
తాజాగా, ‘జనక అయితే గనక’ మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఇందులో మిడిల్ క్లాస్ యువకుడు పిల్లలను పెంచడం, చదివించడం కష్టమని భావించి వద్దు అనుకుంటాడు. కానీ తన భార్య వచ్చి సడెన్‌గా ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పడంతో షాక్ అవుతాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక నాసిరకం కండోమ్‌లను సప్లయ్ చేస్తున్న కంపేనీపై కేసు పెడతాడు. అయితే ట్రైలర్ మొత్తం కోర్ట్ చుట్టూ తిరుగుతోంది. చివరికి వాయిదా పడినట్లు చూపించి ఎండ్ చేశారు. సుహాస్ అసలు ఆ కేసు గెలిచాడా?లేక ఓడిపోయాడా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రజెంట్ జనక అయితే గనక ట్రైలర్ నవ్వించడంతో పాటు ఆలోచింప చేస్తుంది.