- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajamouli: సూర్యపై దర్శకధీరుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇప్పటివరకు ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లనే చెప్పుకోవచ్చు. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అయితే నిన్న (నవంబరు 7)కంగువా(Kangua) ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్కన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. గజిని(Ghajini) సినిమ టైంలో సూర్య (Sūrya)ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారని అన్నాడు. అప్పుడు తెలుగు ప్రజలకు ఈ హీరో ఎలా దగ్గరయ్యారనే విషయాన్ని ఓ కేస్ స్టడీలా ప్రొడ్యూసర్లకు, హీరోలకు చెప్పేవాడినని తెలిపాడు. సూర్యలాగా మన చిత్రాలకు కూడా పలు భాషల్లో తీసుకెళ్లాలని చెప్పేవాడినని, నేను పాన్ ఇండియా సినిమాలు తీయడానికి స్ఫూర్తి సూర్యనే అంటూ జక్కన్న చెప్పుకొచ్చాడు.
సూర్యతో మూవీ తీద్దామనుకున్నానని అన్నాడు. కానీ వీలు కాలేదని.. నేనే ఆ చాన్స్ చేతులారా మిస్ చేసుకున్నానని అన్నాడు. ఆయన నటనను, స్క్రీన్ పై ప్రజెన్స్ ను జనాలకు బాగా నచ్చుతుందని తెలిపాడు. సూర్య కథ ఎంపిక చాలా బాగుంటుందని కొనియాడాడు. ఆ నిర్ణయాన్ని గౌరవిస్తానని.. కంగువా విషయంలో అయితే సినిమా ఓ కొత్త లొకేషన్ కు తీసుకెళ్లి షూటింగ్ చేయడం మరీ కష్టమని వెల్లడించాడు. ప్రత్యేకంగా మేకింగ్ వీడియోను చూస్తుంటే మాత్రం కొత్త ప్రదేశాల్లో, పెద్ద పెద్ద సెట్స్ వేసి షూటింగ్ చేసినట్లు తెలుస్తోందని పేర్కొన్నాడు. నిజంగా మూవీ టీమ్ ఎంత కష్టపడిందో అర్థమవుతుందని అన్నాడు. కాగా ఈ నెల (నవంబర) 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ చిత్రాన్ని చూసి అంతా ఆదరిస్తారని అనుకుంటున్నానని రాజమౌళి ఈవెంట్ లో మాట్లాడారు. ఇక రాజమౌళి, సూర్య చేయాలనుకున్న సినిమా మగధీర అని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ కూడా ఈ విషయాన్ని ఓ కార్యక్రమంలో చెప్పినట్లు జనాలు చర్చించుకుంటున్నారు.
👉Also Read : Prabhas: పాన్ ఇండియా ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.. అస్సలు ఊహించి ఉండరుగా..!