Toll Charges: ఆ జాతరకు వెళ్లే వాహనాలకు టోల్ చార్జీలు ఫిక్స్

by Vinod kumar |   ( Updated:2022-04-13 11:33:45.0  )
Toll Charges: ఆ జాతరకు వెళ్లే వాహనాలకు టోల్ చార్జీలు ఫిక్స్
X

దిశ, అచ్చంపేట: తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి గాంచిన సలేశ్వరం జాతరకు కొవిడ్ అనంతరం రెండేళ్ల తర్వాత ఫారెస్ట్ అధికారులు సలేశ్వరం దర్శనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విధితమే. ఈ జాతరకు వచ్చే భక్తుల వాహనాలకు రేట్లు ఫిక్స్ చేస్తూ బుధవారం అటవీశాఖ బ్యానర్, ఫ్లెక్సీలు విడుదల చేశారు. ఈ జాతరకు 15వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తూ.. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు ఫారెస్ట్ అధికారులు పలు ఆంక్షలను విధించారు.

సలేశ్వరం జాతరకు టోల్ రేట్లు..

సలేశ్వరం జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ చెక్ పోస్ట్, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు దోమలపెంట చెక్ పోస్ట్ వద్ద టోల్గేట్ రుసుము వసూలు చేసేలా అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కారు లేదా జీపులో వచ్చే వాహనదారులకు ఒక్క వాహనానికి రూ.1000, ట్రాక్టర్ లేదా ఆటోలో వచ్చే వాహనదారులు ఒక్క వాహనానికి రూ.500, లారీ, ఆర్టీసీ బస్సు, డీసీఎం రూ.500, టూ వీలర్ (బైక్ లేదా ఇతర వాహనం) నందు వచ్చే భక్తులకు ఒక్క వాహనానికి రూ.100 చొప్పున చెల్లించవలసి ఉంటుందని రేట్లు ఫిక్స్ చేశారు.

వేలాది వాహనాలు..

నిరంతరం దాదాపు వేల సంఖ్యలో వచ్చే వాహనాలతో ఫారెస్ట్ ఖజానా కూడా భారీగానే నిండే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు టోల్గేట్ చార్జీలు పెంచడం పట్ల యాత్రికులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed