- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు.. హంగామా మామూలుగా లేదుగా..
దిశ, సినిమా: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇండియాలో ఈ పేరు తెలియని వారుండరు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 2002లో ‘ఈశ్వర్’ మూవీతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ప్రభాస్.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబల్, మిర్చి వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాడు. ఆపై దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలు తెలుగు సినిమా కూడా రూ. 2,000 కోట్ల వసూళ్లను సాధించగలదని నిరూపించాయి. అలాగే సలార్, కల్కి2898ఏడీ వంటి సినిమాలతో తెలుగు సినిమాలను హాలీవుడ్ రేంజ్‌లోకి తీసుకెళ్లిపోయాడు. ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న డార్లింగ్ ప్రభాస్‌ది నేడు పుట్టినరోజు.
పుట్టిన రోజు హంగామా:
ప్రభాస్ ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ ఫ్యాన్స్‌కి నేడు ఫుల్ కిక్ ఇచ్చే స్థాయిలో పుట్టిన రోజు స్పెషల్ ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలు పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ అయ్యాయి. మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్, రెబల్, సలార్ సినిమాలు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఈ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాల్లోనే ప్రభాస్ నటించిన ఈ చిత్రాలు రీ రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున హడావుడి కనిపిస్తోంది. సాధారణంగా ఏ హీరో బర్త్ డే అయినా ఆయన నటిస్తున్న సినిమాల యొక్క అప్‌డేట్స్ రావడం కామన్‌గా చూస్తూ ఉంటాం. అలాగే ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ‘రాజాసాబ్’ సినిమా నుంచి ప్రత్యేక వీడియోను విడుదల చేయడంతో పాటు, కీలక విషయాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా 'సీతారామం' మూవీ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఫౌజీ’ సినిమా గురించి ఆసక్తికర విషయాలతో ఒక అప్డేట్ వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.