Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (31-12-2024)

by Anjali |   ( Updated:2024-12-30 21:46:01.0  )
Today’s Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (31-12-2024)
X

మేష రాశి: ప్రమోషన్లు అందుకుంటారు. ప్రమోషన్లు అందుకుంటారు.నేడు ఈ రాశివారు అపరిమితమైన ఎనర్జీగా, ఉత్సాహంగా ఉంటారు. నేడు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ ఫ్రెండ్స్ కు హెల్ప్ చేస్తారు ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి. జిమ్ కు వెళ్తారు. భాగస్వామితో సాయంత్రం వేళ సంతోషంగా గడుపుతారు.కానీ వ్యాపారాల విషయాలను గమనించుకుంటూ ఉండండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు.

వృషభ రాశి: నేడు మీరు ఇష్టమైన వారితో ప్రశాంతంగా గడుపుతారు.కానీ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. సెమినార్లు ఇస్తారు. దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు. భాగస్వామితో కలిసి ఎక్జైటింగ్ పనులు చేస్తుంటారు. పెద్దవారి సలహాలు తీసుకుంటారు. రాశి వారి ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి.

మిథున రాశి: కొత్త ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ ను వదిలేయండి. ఓటమి పాలవుతారు. కానీ వెంటనే విజయాలు మీ సొంతమవుతాయి. సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఈ రోజు ఎక్కువగా నడుస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మీ భాగస్వామితో రాత్రిపూట గొడవ పడుతారు.

కర్కాటక రాశి: పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ ఫ్యామిలీలో గొడవలు వస్తాయి. ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు. కానీ అక్కడ కూడా తెలియని వారితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరుగుతుంది. నేడు పక్షులకు గింజలు వేస్తే మంచి జరుగుతుంది. నేడు ఈ రాశివారు ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహ రాశి: నేడు ఈ రాశి వారు ఆఫీసులో ఇతరులతో మాట్లాడుతూ టైమ్ వేస్ట్ చేయకండి. తొందరగా బయట పడేందుకు ప్రయత్నించండి. మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ చివర వరకు ధనాన్ని పొదుపు చేస్తారు. ఈ రాశివారు ఖర్చును తగ్గిస్తే మంచిది. అనవసరపు ఖర్చులు పెట్టవద్దు. శుభవార్తలు వింటారు.

కన్యా రాశి: ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కూతూహాలాన్ని రేకెత్తించే మంచి విషయాలు చదవండి. మీ శ్రీమతి తరపున బంధువులు కారణంగా గొడవలు జరుగుతాయి. నేడు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. కాగా జాగ్రత్త వహించండి. ఫ్యామిలీతో గడపాలని అనుకున్న ప్రణాళికలు విఫలం అవుతాయి. జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే నొప్పించే అవకాశం ఉంది.

తులా రాశి: నేడు ఈ రాశి వారు డబ్బు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెట్టాలో నేర్చుకుంటారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. బంధువులు రాకతో ఇల్లు కళకళలాడుతుంటుంది. మిమ్మల్ని ఇష్టపడేవారితో గడపుతారు. ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. కానీ అనవసరపు విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకుంటారు. పలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాగా ఈ రాశివారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడడం మేలు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చిన్న చిన్న పార్టీలకు అటెంట్ అవుతుంటారు.

వృశ్చిక రాశి: నేడు మంచి విజయాలు అందుకుంటారు. కానీ ఆర్థికపరంగా మీ ఆలోచనలు ముందుకు సాగవు. మంచి నవలను కానీ, మ్యాగజైన్ కానీ చదువుతారు. సాయంత్రం వేళ స్నేహితులతో గడపండి. మీ భాగస్వామి నేడు మిమ్మల్ని పొగడటమే పనిగా పెట్టుకుంటాడు. ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు.

ధనుస్సు రాశి: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి. మీరు ఊహించనివారి నుంచి డబ్బు అందుకుంటారు. ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం బెటర్. కుటుంబ సభ్యులకు సహాయపడండి. ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు.మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్తారు. మీ భాగస్వామి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా హెల్ప్ చేస్తారు.

మకర రాశి: రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆలోచన చేస్తారు. విహార యాత్రలకు వెళ్తారు.కానీ అనారోగ్యంతో దీర్ఘకాలికంగా పోరాడుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువగా గడుపుతారు. దీంతో మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో పలు గొడవలు జరుగుతాయి. బంధువుల కారణంగా చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. ఆర్థికంగా నష్టపోతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనకడుగు వేస్తారు. కాగా పెద్దల సలహాలు తీసుకోవడం మేలు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మీ భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చుపెడతారు.

కుంభ రాశి: ఫ్రెండ్స్ తో కలిసి పిక్‌నిక్ వెళ్తారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవండి. యోగా చేయడం మంచిది. దీంతో మానసిక ప్రశాంతత పొందుతారు. మీరు గతంలో కొనుగోలు చేసిన స్థలాన్ని అమ్ముతారు. డబ్బు పరంగా కలిసి వస్తుంది.భాగస్వామితో హ్యాపీగా గడుపుతారు. బంధువుల మద్ధతు లభిస్తుంది. మీపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు. కానీ ఎవరినీ అంతగా నమ్మవద్దు. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. మీ భాగస్వామితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు.

మీన రాశి:ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. బంధువుల ఇంటికెళ్తారు. దీంతో రిలాక్స్ అవుతారు. నేడు మీ దగ్గరి వాళ్లను అన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా మెలగండి. మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు. ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో సినిమాకు రాత్రి సమయంలో ఎక్కువగా మాట్లాడుతుంటారు. హెల్త్ విషయంలో జాగ్రత్తపడాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed