- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యాచారం ఫార్మా రైతుల కదికలపై కన్ను.. ప్రత్యేక ఇంటిలిజెన్స్‌తో నిఘా
దిశ, రంగారెడ్డి బ్యూరో/యాచారం: ఫోర్త్ సిటీ అభివృద్ధిలో భాగంగానే పొల్యూషన్ లేని ఫార్మా ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఓఆర్ఆర్ నుంచి కడ్తాల్ మండలం బేగరి కంచె వరకు 300 ఫీట్స్ రోడ్ల నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేగాక రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, తిమ్మాపూర్ గ్రామాల మీదుగా ఫోర్త్ సిటీకి మరో దారికి భూసేకరణ
జరుగుతుంది. ఈ విధంగా ఫోర్త్ సిటీ ప్రాంతానికి నాలుగు వైపులా రవాణా సౌకర్యం, మౌలిక సదుపాయాలు, తాగు నీరు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే గతంలో ఫార్మా కంపెనీలు కోసం ప్రభుత్వం భూములను సేకరించారు. ఆ భూముల్లోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులోనే పొల్యూషన్ లేని ఫార్మా సతైం ఒక జోన్‌గా విభజించాలని భావిస్తుంది. అయితే మరింత భూసేకరణ జరగాల్సి ఉంది. ఈ భూసేకరణకు స్థానికులు సహకరించవద్దని నిర్ణయం తీసుకున్నట్లు ఇంటలిజెన్స్ సమాచారంతో ప్రభుత్వం అలర్టయినట్లు తెలుస్తుంది.
ఫార్మాను వ్యతిరేకిస్తున్న రైతులు..
ఫార్మా కంపెనీ ఏర్పాటుతో పంట పొలాలు, పశువులు, ఆరోగ్య సమస్యలు అధికమై పరిస్థితి ఉందని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఫార్మాను ఎత్తివేసి ఆ స్థానంలో మరో రకమైన రంగాల సంస్థలు తీసుకొస్తామని హామీనిచ్చిందని దాని మేరకు జీవో విడుదల చేయాలని స్థానికులు పట్టుబడుతున్నారు. దీంతో ప్రభుత్వం, స్థానిక రైతుల మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. ప్రభుత్వం ప్రజలకు ఫార్మాపై నిర్దిష్టమైన హామీ ఇవ్వనంత వరకు ప్రజలు భూ సేకరణకు సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయం పసిగట్టిన పోలీసులు రైతుల కదలికలపై నిఘా పెట్టారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఏ కార్యక్రమం చేపట్టిన పోలీసుల అనుమతి తీసుకోవాలని రైతులకు సూచించారు. ఇటీవల యాచారం మండల పరిధిలోని నాలుగు
గ్రామాలు కుర్మిద్ద, నానక్ నగర్, తాడిపర్తి, మేడిపల్లి రైతులు నానక్ నగర్‌లో ఫార్మాపై ఒక అవగాహన సదస్సు పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసులు నోటీసులు జారీ చేశారు. తమ కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేసుకోవాలి.. ఏ రూల్స్ ప్రకారం రద్దు చేసుకోవాలో పోలీస్ అధికారులు తమకు చెప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేవలం మా నిరసన కార్యాక్రమాలను అడ్డుకోవడానికి మాత్రం నోటీసులు ఇవ్వడం.. పర్మిషన్లు అవసరం లేని కార్యక్రమాలకు సైతం కచ్చితంగా పర్మిషన్లు తీసుకోవాలని ఆక్షంలు పెట్టడం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సేకరించాల్సింది 5వేల ఎకరాలు..
జిల్లాలోని యాచారం, కందుకూరు మండలాల ప్రాంతాల్లో గ్రీన్ ఫార్మా పేరుతో గత ప్రభుత్వం సుమారు 19,333 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు రైతులకు నోటీసులు జారీ చేసింది. సుమారు 13,500 ఎకరాల వరకు భూ సేకరణ చేపట్టింది. ఇందులో కొంత అసైన్డ్, సీలింగ్, పట్టా భూములు ఉన్నాయి. మరో 5వేల ఎకరాలు భూమి సేకరించాల్సి ఉంది. ఇందులో సుమారు 2200 ఎకరాల సంబంధించిన రైతులు ఈ భూములు ఫార్మాకు ఇవ్వబోమని కోర్టుకు వెళ్లారు.
రైతుల కదలికలపై ప్రత్యేక ఇంటిలిజెన్స్
లగచర్ల ఘటన పునరావృతం కావొద్దని దాంతో యాచారం ఫార్మా రైతుల కదికలపై ప్రభుత్వం కన్నెసింది. ఎలాంటి కార్యక్రమాలకు కార్యాచరణ చేసుకుంటున్నారు. అనే దానిపై ప్రత్యేక ఇంటిలిజెన్స్‌తో నిఘా పెట్టిస్తుందని రైతుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఉద్యమాలు చేస్తున్న వేళ.. నోటిఫికేషన్ జారి...
పటాన్ చెరువు, పారిశ్రామిక వాడలో ఇదివరకే ఏర్పాటు చేసిన పరిశ్రమల వల్ల కలిగే నష్టాలు ర్యాలీల ద్వారా ప్రజలకు వివరిస్తూ ఫార్మాసిటీ రద్దుచేసి పట్టా భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆందోళనలు చేస్తున్న వేళ కుర్మిద్ద గ్రామంలో భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో మాట ఇచ్చి తప్పుతున్నారని ఫార్మా వ్యతిరేక కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తున్నారు.
ఉద్యమాలు చేసిన నాయకులు ఎక్కడ దాక్కున్నారు?
- కవుల సరస్వతి, ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ కన్వీనర్
అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి రైతుల భూములు తిరిగి ఇస్తామని చెప్పిన నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు. ఇచ్చిన హామీని మర్చిపోయి పోలీసులతో ఉద్యమాలను అణిచివేయాలని చూస్తుండ్రు.
కోర్టు కేసులో ఉన్న భూములకు నోటిఫికేషన్ ఎలా ఇస్తరు
-కుర్మిద్ద, రైతు అండేకర్ దేవోజి,
కుర్మిద్ద గ్రామంలోని పట్టా భూముల విషయంపై కోర్టులో కేసు నడుస్తుండగా వాటికి నోటిఫికేషన్ ఎలా ఇస్తరు. శాంతియుతంగా పోరాడుతుంటే పోలీసులతో వేధించడం తగదు.