Sabarimala: 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు దర్శనం

by Gantepaka Srikanth |
Sabarimala: 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు దర్శనం
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ(Kerala)లోని శబరిమల ఆలయా(Sabarimala Temple)నికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. గత 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తాజాగా స్పాట్‌ దర్శనానికి ట్రస్టు అధికారులు 20 వేల టికెట్లు ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే పంబ నుంచి సన్నిదానం వరకు అయ్యప్ప భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పా్ట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా శబరిమల ఆలయానికి వెళుతున్నారు.

మాల ధరించి 40 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో అయ్యప్పకు పూజలు నిర్వహించారు. అయితే, ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న మకరజ్యోతి దర్శనానికి భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మకరవిలక్కు పండుగలో భాగంగా ఈనెల 12వ తేదీన పందలం నుంచి ‘తిరువాభరణం’ ఊరేగింపు స్టార్ట్ అవుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed