పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ను వెంటనే తొలగించాలి.. అమిత్ షాకు లేఖ

by Vinod kumar |
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ను వెంటనే తొలగించాలి.. అమిత్ షాకు లేఖ
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్కర్‌ను తొలగించాలని టీఎంసీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌‌ను డిమాండ్ చేశారు. గురువారం టీఎంసీ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు అమిత్ షాకు లేఖ సమర్పించారు. ధన్కర్‌ను పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని అభివర్ణించారు. బీర్భూం సంఘటనలో ఎనిమిది మంది వ్యక్తుల ప్రమాదకరమైన, అమానవీయ, క్రూరమైన హత్యలు ఏ రాజకీయ ఘర్షణల ఫలితం కాదని పార్టీ పేర్కొంది.


'ధన్కర్ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పులా ఉన్నారు. అతను దేశ ప్రభుత్వాన్ని.. రాజ్యాంగాన్ని నడిపించే సమాఖ్య నిర్మాణాన్ని పూర్తిగా అడ్డుకునే రీతిలో కనిపిస్తున్నారు' అని లేఖలో పేర్కొన్నారు. ఇదే విషయమై సీఎం మమతా బెనర్జీకి కూడా ఎంపీలు లేఖను సమర్పించారు. ఈ అమానవీయ, క్రూరమైన హత్యల నుండి ఎటువంటి రాజకీయ లబ్ధి పొందవద్దని రాష్ట్ర బీజేపీ పార్టీని లేఖలో కోరారు.

సజీవ దహనానికి ముందు చావగొట్టారు..


బీర్భూం మారణకాండలో మృతుల పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా సేకరించిన సమాచారం తో కలుపుకుని వారిని దారుణంగా కొట్టిన తర్వాత బతికుండగానే నిప్పంటించారని వెల్లడించింది. ఇప్పటికే ఈ హత్యలతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed