Shiva Karthikeyan: ‘అమరన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

by Hamsa |   ( Updated:2024-10-26 14:32:05.0  )
Shiva Karthikeyan: ‘అమరన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi), కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్(Shiva Karthikeyan) జోడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమరన్’. ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్(Mukund Varadarajan) బయోపిక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ పెరియసామి(Raj Kumar Periasamy) దర్శకత్వంలో తెరకెక్కింది. రాజ్ కమల్ బ్యానర్‌పై కమల్ హాసన్(Kamal Haasan), సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ‘అమరన్’(Amaran) మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సాయిపల్లవి(Sai Pallavi), శివ కార్తికేయన్ కెమిస్ట్రీ ఫిదా అయ్యేలా చేసింది.

ఇక ఇటీవల వచ్చిన ట్రైలర్ ‘అమరన్’(Amaran) సినిమాపై హైప్ పెంచేసింది. అయితే ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. తాజాగా, మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌(Pre Release Event) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు (అక్టోబర్ 26)న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని ITC ఖోహినూర్ హోటల్‌(ITC Kohinoor Hotel)లో జరగబోతుంది.

అయితే ఈ వేడుకకు ‘కల్కి’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగ్ అశ్విన్(Nag Ashwin) ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. దీంతో ఈ ఈవెంట్‌కు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi)ని డైరెక్ట్ చూసే అవకాశం వస్తుందని ఎంట్రీ పాస్‌ను సంపాదించే పనిలో పడ్డారు.

Advertisement

Next Story