- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Thrisha Krishnan: విడాకులు తీసుకున్న సింగర్‌తో త్రిష పెళ్లి..? నెట్టింట దుమారం రేపుతున్న న్యూస్..!
దిశ, సినిమా: సాధారణంగా హీరోయిన్స్ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆ హీరోతో ప్రేమలో ఉందని, ఈ డైరెక్టర్‌ను ఇష్టపడుతుందనే వార్తలు వస్తునే ఉంటాయి. ఇంకా 40 ఏళ్లు వచ్చాక కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటే మాత్రం అంతే సంగతులు. ఈ క్రమంలో అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Thrisha) గురించి ఓ పుకారు నెట్టింట షికారు చేస్తోంది. విడాకుల అయిన ఓ స్టార్ సింగర్‌తో ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యిందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
నిన్న మొన్నటి వరకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Kollywood Star Vijay)ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వచ్చిన వార్తలు ఇప్పడు సడెన్‌గా సింగర్‌తో పెళ్లి అంటూ వస్తున్నాయి. మరి ఇంతకీ ఆ స్టార్ సింగర్ ఎవరో కాదు ర్యాప్ సింగర్‌గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నోయల్(Noel). ఈయన కేవలం సింగర్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్(Charecter Artist)గా కూడా చేసి మెప్పించాడు. ఇక ఈయన నటి ఎస్తేర్(Esther)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లయి సంవత్సరం కాకుండానే పెటాకులు అయినాయి. అయితే తాజాగా అనన్య నాగళ్ల(Ananya Nagalla) నటించిన ‘పొట్టేల్’(Pottel) మూవీలో నోయల్ కూడా ఒక కీ రోల్ ప్లే చేశాడు. ఇక ఈ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకోవడంతో నోయల్ అరియానా(Ariyana) హోస్ట్‌గా చేసిన టాక్ షోలో పాల్గొన్నారు. అయితే ఈ టాక్ షోలో అరియానా నుండి నోయల్‌కి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇందులో భాగంగా మీరు హీరోయిన్లలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అని అడగగా.. దానికి నోయల్ స్పందిస్తూ.. “హీరోయిన్లందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. హీరోయిన్లను పెళ్లి చేసుకుంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే షూటింగ్లకి ఎక్కడికో వెళ్తారు. కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఒకవేళ లిఫ్ట్ చేసినా మళ్లీ చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తారు. ఇక ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది అందమైన హీరోయిన్లకు పెళ్లిళ్లు అయిపోయాయి. అలాగే త్రిష గారు రోజురోజుకి చాలా అందంగా తయారవుతున్నారు. త్రిష గారినే నేను పెళ్లి చేసుకుంటా” అంటూ నోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో త్రిష నోయల్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.