- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం తాగితే భారతీయులు కాదు: సీఎం సంచలన వ్యాఖ్యలు
పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు నకిలీ మద్యపానం పై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, మద్యం తాగే వారు భారతీయులు కాదని అన్నారు. వారిని మహాపాపిలని సంభోదించారు. విషపూరితమైన మద్యం సేవించి మరణించిన వారికి ప్రభుత్వం పరిహారాన్ని ఇవ్వలేదని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ కూడా మద్యపానాన్ని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. 'మద్యం తాగే వారిని నేను భారతీయులుగా పరిగణించను. మద్యం సేవించడం హానికరం అని తెలిసినా కొందరు వినియోగిస్తున్నారు. తర్వాత పరిణామాలకు వారే బాధ్యత వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కాదు' అని చెప్పారు. కాగా, బుధవారమే బీహార్ అసెంబ్లీ మద్యపాన నిషేధ బిల్లు-2022 బిల్లు(సవరణ)కు ఆమోదం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం సేవించడం పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే, దీనికి కొన్ని మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. దీని ప్రకారం మద్యం అమ్ముతూ లేదా సేవిస్తూ ఎవరైనా పట్టుబడితే ఎక్సైజ్ కోర్టుకు పంపనున్నారు.