- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రి సమయంలో కాలేజీలో వింత అరుపులు.. బయటకు పరుగులు తీసిన విద్యార్థినులు
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో దెయ్యం ఉందని విద్యార్థినులు బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి కళాశాలలోని 4వ అంతస్తు భవనంలో ఓ వింత అరుపులు వస్తున్నట్లు విద్యార్థినీలు తెలిపారు. రాత్రి సమయంలో కొన్ని గదుల నుంచి అరుపులు, వింత శబ్దాలు రావడం తో భయాందోళన చెందుతున్నట్లు వాపోయారు. కాగా గురువారం జన విజ్ఞాన వేదిక సభ్యులు కళశాలలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. మూఢనమ్మకాలు లేవని, నమ్మొద్దని సూచించారు.
నాలుగవ సెమిస్టర్ పరీక్షలే కారణం
డిగ్రీ విద్యార్థులకు నాలుగవ సెమిస్టర్ పరీక్షలు వస్తున్నాయని ఇంటికి వెళ్లిందుకే, ప్రణాళికలో భాగంగా దెయ్యం వదంతులు సృష్టించారని అధ్యాపకులు తెలుపుతున్నారు.
విద్యార్థినులకు అవగాహన కల్పిస్తాం.: ఆర్టీవో రాజ్య లక్ష్మి
డిగ్రీ కళాశాల విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పిస్తాం. విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శాస్త్ర, సాంకేతిక రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇలాంటి వందతులను నమ్మకూడదని తెలిపారు.