- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెహమాన్ విడాకులకు.. ఆమె డైవర్స్‌కు ఎలాంటి సంబంధం లేదు: లాయర్
దిశ, వెబ్ డెస్క్: సంగీత విద్వాంసుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఏఆర్ రెహమాన్ (AR Rahman Divorce) విడాకుల వార్త యావత్ భారతాన్ని కుదిపేసింది. రెహమాన్ - సైరా విడాకుల ప్రకటన సినీ లోకాన్ని షాకయ్యేలా చేసింది. వాళ్లిద్దరూ తమ వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నామని ప్రకటించి, తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరారు. అయితే ఏఆర్ రెహమాన్ అసిస్టెంట్ (Rahman Assistant Divorce) కూడా విడాకులు తీసుకుందన్న వార్తలు రావడంతో.. ఆమె కోసమే రెహమాన్ తమ 29 ఏళ్ల వివాహ బంధానికి విడాకులతో స్వస్తి పలికారన్న వార్తలు గుప్పుమన్నాయి.
రెహమాన్ - సైరా విడాకులు ప్రకటించిన రోజునే.. ఆయన బాసిస్ట్ మోహిని (Bassist Mohini) కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు తెలిపింది. దీనిపై సైరా తరఫు లాయర్ క్లారిటీ ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే రెహమాన్ - సైరా దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నారని, మోహిని విడాకులకు, దీనికి సంబంధం లేదని తెలిపారు. మరి ఇందులో నిజమెంత ఉందనేది వాళ్లకే తెలియాలంటున్నారు నెటిజన్లు.