Ghee: స్నానానికి ముందు ఈ పార్ట్‌లో నెయ్యి రాస్తే బోలెడు లాభాలు.. ?

by Anjali |   ( Updated:2024-10-30 06:30:53.0  )
Ghee: స్నానానికి ముందు ఈ పార్ట్‌లో నెయ్యి రాస్తే బోలెడు లాభాలు.. ?
X

దిశ, వెబ్‌డెస్క్: నెయ్యి (Ghee:) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ పరిమితిలో తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. నెయ్యి కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఉపయోగపడుతుంది. నెయ్యి తినడం వల్ల ఫేస్ పై పింపుల్స్(Pimples), మచ్చలు(spots) తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రతిరోజూ నెయ్యిని తీసుకుంటే ముఖం కాంతిమంతంగా మెరిసిపోతుంది. రాత్రి పడుకొనే ముందు నెయ్యితో పెదాలపై మర్దన చేసుకుంటే పెదాల రంగు మెరుగవ్వడమే కాకుండా మృదువుగా మారతాయి. అలాగే నెయ్యి చర్మంలో కొల్లాజెన్(Collagen) అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం.. నాభిని శరీర శక్తి కేంద్రంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. కాగా ఇన్ని ప్రయోజనాలున్న దేశీ నెయ్యిని నాభి లోపల అప్లై చేస్తే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నెయ్యి నాభికి అప్లై చేస్తే లాభాలు..

విటమిన్ ఎ, ఇ, డి, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు(Antibacterial properties) పుష్కలంగా ఉండే నెయ్యిని నాభికి రాస్తే చర్మాన్ని తేమగా ఉంచడంలో మేలు చేస్తుంది పొడిబారిన చర్మాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉంచుతుంది. నాభిని జీర్ణక్రియ ప్రదేశంగా భావిస్తారు. కాబట్టి నెయ్యి అప్లై చేయడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు(Digestive enzymes) సక్రియం అవుతాయి. మలబద్ధకం(Constipation) సమస్యను దూరం నెయ్యి దూరం చేస్తుంది. నాభి వద్ద రెండు చుక్కల నెయ్యి వేసి మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు(Joint pains) పరార్ అవ్వాల్సిందే. అలాగే వాత దోషం కూడా తగ్గిపోతుంది. చర్మం తళతళ మెరిసిపోతుంది. పొత్తికడుపు(abdominal)లో నొప్పిని తగ్గిస్తుంది. ధ్యానం(meditation) చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో స్నానం చేసే ముందు నెయ్యిని నాభి వద్ద అప్లై చేస్తే అన్ని లాభాలున్నాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed

    null