- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌర వ్యవస్థ వెలుపల 5 వేల ప్రపంచాలు.. నాసా నిర్ధారణ
నేషనల్: సాధారణంగా మనుషులు ఆకాశంకేసి చూడటం ప్రారంభించినప్పుడు వారికి వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏదంటే, ఈ సువిశాల ప్రపంచంలో మనం ఒంటరిగా ఉంటున్నామా అనే. ఆ తర్వాత సూర్యుడి చుట్టూ బిలియన్ల కొద్దీ కిలోమీటర్ల దూరంలో గ్రహాలు ఏర్పడి మన సౌర వ్యవస్థ ఏర్పడిందని మనం కనుగొన్నాం. కానీ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ అంతరిక్ష పరిమితిని దాటి చేసిన అన్వేషణలో అనంత విశ్వంలో 5,000 ప్రపంచాలు మనం ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయని తేలింది.
తాజాగా విశ్వంలో మరో 65 కొత్త గ్రహాలను కనిపెట్టిన నాసా, మన సౌర వ్యవస్థ వెలుపల నక్షత్రాల చుట్టూ 5 వేల గ్రహాలు ఏర్పడి కనిపిస్తున్నాయని తెలిపింది. దీంతో విశ్వాన్వేషణలో సరికొత్త మైలురాయిని శాస్త్రజ్ఞులు సాధించినట్లయింది. నాసా కొత్తగా కనిపెట్టిన ఈ 65 గ్రహాల్లో నీరు, సూక్ష్మజీవులు, వాయువులు ఉండవచ్చని చివరకు జీవం కూడా వాటిపై ఉండవచ్చని భావిస్తున్నారు. కొత్తగా కనిపెట్టిన ఈ 65 గ్రహాలు ఒక్కోటి ఒక్కో కొత్త ప్రపంచాన్ని అంటే కొత్త గ్రహ రూపాన్ని కలిగి ఉన్నాయని నాసా పేర్కొంది.
మనం ఈ సువిశాల విశ్వంలో ఒంటరిగానే ఉన్నామా అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం అవుననే చెబుతున్నారు. అంతరిక్ష పరిశోధనల క్రమంలో అనేక గ్రహ రూపాలను కనుగొంటున్నందున సమీప భవిష్యత్తులో సుదూర విశ్వంలో ఎక్కడో ఒక చోట జీవం ఉండే ఉంటుందని రోదసీ పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఇంతవరకు కొత్తగా బయటపడుతున్న ఈ గ్రహాలను లోతుగా అధ్యయనం చేయలేకపోయాం కనుక కొత్త గ్రహాల్లో జీవం ఉందా అనే ప్రశ్నకు సమాధానం నిర్దిష్టంగా లేదనే చెప్పాలి.