ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. అతడి వల్లే అంటున్న తల్లిదండ్రులు..!

by Satheesh |
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. అతడి వల్లే అంటున్న తల్లిదండ్రులు..!
X

దిశ, నల్లగొండ: ఉరేసుకుని ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని శేషమ్మ గూడెంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కాలనీకి చెందిన దోరెపల్లి భిక్షమయ్య కుమార్తె ప్రత్యూష (17) పట్టణంలోని సప్తపది జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో ఓ యువకుడు ప్రత్యూషను వేధిస్తున్నట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె నాయనమ్మ గమనించి, ‌స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కాగా, ఓ యువకుడి వేధింపుల వల్లే తమ కుమారై ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నామని రూరల్ ఎ‌స్ఐ గోపాల్ రావ్ తెలిపారు.

Advertisement

Next Story