అభివృద్ధికి ఆమడ దూరంలో బీరన్న దేవాలయం..

by Mahesh |
అభివృద్ధికి ఆమడ దూరంలో బీరన్న దేవాలయం..
X

దిశ, ఆత్మకూర్: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి పాటుపడుతున్నారు. కానీ మండలంలోని పెంచికలపేట గ్రామం లోని బీరన్న దేవాలయం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఈ ఆలయం మందుబాబులకు అడ్డగా మారుతూ.. బీరు బాటిళ్లతో దర్శనమిస్తుంది. ఎన్నికలు వస్తే కుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని.. మీ కులం ఓట్లు మాకే వేయాలనే పాలకులు ఎన్నికైన తర్వాత కులానికి సంబంధించిన బీరన్న దేవాలయాన్ని పట్టించుకోవడంలేదని కురుమ కుల ప్రజలు అంటున్నారు.

గతంలో దాతల సహకారంతో బీరన్న దేవాలయాన్ని అడపాదడపా గా నిర్మించిన ఆలయానికి సరైన కాంపౌండ్ వాల్ లేదు. సంవత్సరానికి ఒకసారి కురుమ కులస్తులు వారి పండుగ వస్తేనే ఈ గుడి తలుపులు తీస్తారు. మిగతా సమయంలో మూసి ఉంచడంతో పొద్దున, సాయంకాలం వేళల్లో అసాంఘిక శక్తులకు ఆలయ పరిసరాలు అడ్డగా మారుతున్నాయి. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వినూత్నంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. అదేవిధంగా బీరన్న ఆలయానికి కాంపౌండ్ వాల్ నిర్మించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పెంచికలపేట గ్రామ కురుమ కులస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story