- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగ్గురు మౌనికలు.. ఒకే ఊరు, ఒకే బడి, ఒకే ఉద్యోగం
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : మౌనిక.. మౌనిక.. మౌనిక.. అదేంటి కోర్టులో పిలిచినట్లు మూడుసార్లు పిలుస్తున్నారేంటి అనుకుంటున్నారా? అదేం కాదండీ. వారందరిది ఒకే పేరు.. ఒకే మండలం.. ఒకే తరగతి.. ఒకే స్కూల్.. ఒకే కోర్సు.. ఒకే ఉద్యోగం.. చివరికి ఒకే కార్యాలయంలో ఒకే హోదాలో పనిచేస్తున్నారు.. ఈ ముగ్గురూ స్నేహితురాళ్ల పేర్లూ మౌనికనే. కాకపోతే ఒకరు మోరె మౌనిక, మరొకరు సిబ్బుల మౌనిక, ఇంకొకరు కుంట మౌనిక. ముగ్గురూ నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలంలోని శారదా విద్యా మందిరంలో చదువుకున్నారు. తెచ్చుకున్న ఉద్యోగమూ ఒకటే. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న ఆఫీసు కూడా ఒకటే కావడం ప్రత్యేకం.
ఈ మౌనికలంతా 2014లో అగ్రికల్చర్ డిప్లొమా పూర్తిచేసి... 2017లో ముగ్గురూ మండల వ్యవసాయ విస్తరణాధికారులుగా ఎంపికయ్యారు. అదే మండలంలో కొలువులు రావడంతో ఒకే ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు. ఒకేపేరు... ఒకే పాఠశాల... ఒకే ఉద్యోగం.. ఒకే కార్యాలయంలో విధులు... వినేవారికి వింతగానూ ఆసక్తిగానూ ఉంది కదా? మొదట్లో చాలామంది గందరగోళానికి గురయ్యేవారు. తర్వాత వారిని ఇంటిపేర్లతో పిలవడంతో.. గందరగోళం తప్పింది. మేమంతా కలిసి పని చేయడం ఆనందంగా ఉందని అంటున్నారీ మౌనికలు!