- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రికి రాత్రి గుడిని తొలగించిన అధికారులు.. న్యాయం కావాలంటూ రోడ్డెక్కిన గ్రామస్తులు
దిశ గుమ్మడిదల : రాత్రికి రాత్రి మైసమ్మ గుడిని తొలగించిన అటవీ శాఖ అధికారులు. మాకు న్యాయం కావాలంటూ నడిరోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామం శివార్లో గల ఉన్న మైసమ్మ దేవతను తమ గ్రామ ఇలవేల్పుగా భావిస్తూ ఈ మంబాపూర్ గ్రామస్తులు గత 50 సంవత్సరాల నుండి పూజిస్తునమని అంటున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని నెలలుగా ఈ గుడి ప్రాంగణంలో తరుచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని. ఈ నేపథ్యంలో అమ్మవారు తమపై ఆగ్రహించిందేమో అని భావించిన గ్రామస్తులు అందరూ కలిసి అమ్మవారికి ఆదివారం పండగ చేసి శాంతింప చేద్దామని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కొందరు గ్రామస్తులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు అక్కడికి వెళ్లగా అక్కడ ఆ గుడి పూర్తిగా తొలగించి, గుడి రాళ్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో చిందర వందరగా పడేశారు. ఇది గమనించిన గ్రామస్తులు ఈ గుడి అటవి ప్రాంతంలోనే ఉన్నందున అటవీశాఖ అధికారులే ఇలా చేసి ఉంటారని ఆగ్రహించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సర్పంచ్ శ్రీనివాస్ పంచాయతీ పాలకవర్గ సభ్యులు మంబాపూర్ గ్రామస్తులు అటవీశాఖ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ఈ ఘాతుకానికి పాల్పడిన అటవి శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే వెంటనే గుడిని పునర్నిర్మించాలని భారీ ఎత్తున జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అరగంటకు పైగా నడి రోడ్డుపై బైఠాయించి నిరసనలు చేశారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న మండల నాయకులు జడ్పిటిసి కుమార్ గౌడ్ సీనియర్ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హుస్సేన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టా నర్సింగరావు గుడి ఉన్న పరిసరాలను పరిశీలించి ఈ ఘాతుకానికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ విజయ్ కృష్ణ ఈ విషయంపై అటవిశాఖ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం గ్రామస్తులు ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫారెస్ట్ సెక్షన్ అధికారి మజీద్ సింగ్ వివరణ..
ఈ విషయంపై ఫారెస్ట్ సెక్షన్ అధికారి మజీద్ సింగ్‌ను వివరణ కోరగా. ఆయన మాట్లాడుతూ నేను గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోని విధులు నిర్వహిస్తున్నానని. ఈ మైసమ్మ గుడిని మంబాపూర్ గ్రామంలో కొంత మంది నూతనంగా నిర్మించారని. శనివారం రోజు రాత్రి సమయంలో ఈ గుడి ప్రాంగణంలో టెంట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు గమనించామని. వెంటనే అక్కడికి వెళ్లి వాటిని అడ్డుకొని వాళ్లను అక్కడి నుండి పంపించామని. అనంతరం అడవిని కాపాడే బాధ్యత తమపై ఉన్నందున అక్కడి నుండి గుడిని తామే తొలగించినట్టు ఒప్పుకున్నారు.