సోషల్ మీడియాలో చిగురించిన ప్రేమ.. చివరికి ఏమైందో తెలుసా?

by Javid Pasha |
సోషల్ మీడియాలో చిగురించిన ప్రేమ.. చివరికి ఏమైందో తెలుసా?
X

దిశ, సినిమా: తేజ, ప్రియ పాల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'నువ్వే అనుకున్నా'. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ యువ జంట తమ ప్రేమను ఎలా జయించారనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న మూవీ ద్వారా డి.రవిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. పాటల చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన రవిబాబు.. ఈ చిత్రాన్ని అందమైన ప్రేమ కావ్యంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకముందని హీరో తేజ వెల్లడించాడు. కాగా ఇంత మంచి లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవడం ఆనందంగా ఉందని హీరోయిన్ ప్రియ పాల్ చెప్పింది. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని బీటీఆర్ ఇన్నోవేషన్ పతాకంపై సీహెచ్. వెంకట రాజ్యం సమర్పణలో బి.శివశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed