తొలిసారిగా మెరుస్తూ కనిపించిన పాల సముద్రం..

by Manoj |
తొలిసారిగా మెరుస్తూ కనిపించిన పాల సముద్రం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టెక్నాలజీ డెవలప్ అయిన దగ్గర నుండి ఎన్నో రకాల అద్భుతాలు బయటపడుతూ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దక్షిణ ఇండోనేషియాలో అరుదైన దృశ్యం కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే యూఎస్ లోని రీసెర్చర్స్ బృందం ఆగష్టు 2019లో పాల సముద్రం గురించి పరిశోధన జరిపారు. అలాంటి వింతలు విశ్వంలోనే ఒకటో రెండో సార్లు చూడగలమని పేర్కొన్నారు.

అందులో భాగంగా దక్షిణ ఇండోనేషియాలో శాటిలైట్ పిక్చర్లలో పాల సముద్రం ఉన్నట్లుగా నిపుణులు గుర్తించారు. కేవలం పాల సముద్రం ఉండటం భ్రమ కాదని నిజంగానే ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ల్యుమినస్ బ్యాక్టీరియా వల్ల నీళ్లలో మెరుపు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed