- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.. వారే విషం కలిపి చంపారా..?
దిశ, తిరుమలాయపాలెం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన సుబ్లేడు గ్రామంలో బుధవారంరాత్రి వెలుగు చూసింది. పోలీసులు, వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సుబ్లేడు గ్రామానికి చెందిన దావా కనకరాజు(37) వ్యవసాయం చేస్తూ భార్య విజయ, పాపా, బాబును పోషించుకుంటున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో జనవరిలో విజయ పుట్టింటికి వెళ్ళిపోయింది. కనకరాజు రోజులాగే వ్యవసాయ పనులకు బుధవారం వెళ్ళాడు. రాత్రి గ్రామంలోని మద్యం(బెల్ట్ షాప్)లో మద్యం సేవించి ఇంటికి వెళుతున్న నేపథ్యంలో, సైకిల్ మెకానిక్ షేక్ మస్తాన్ అనే వ్యక్తి కనకరాజును పిలిచి తన వెంట తెచ్చిన మద్యం పోశాడు. అది తాగిన కనకరాజు ఇంటికి వెళ్లి అస్వస్థకు గురైడు.
దీంతో వాంతులు, విరోచనాలు కావడంతో తల్లి భద్రమ్మకు జరిగిన విషయం చెప్పాడంతో, హుటాహుటిన అతన్ని చికిత్స కోసం 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుని తల్లి భద్రమ్మ అనుమానితులు పేర్లు రాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కనకరాజుపై విష ప్రయోగం చేశారా..? అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గత కొంత కాలంగా కనకరాజు భార్య ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని.. వీరంతా కలిసే ప్లాన్ చేశారని గ్రామంలో ప్రచారం సాగుతోంది.