- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ది కశ్మీర్ ఫైల్స్' ఎఫెక్ట్: దేశ రాజధానిలో సంచలన ఘటన
దిశ, వెబ్‌డెస్క్: మార్చి 11న విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్' చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఓ వర్గం నుంచి ప్రశంసలు, మరో వర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. అంతేగాక, కొంతమందిపై ఈ సినిమా ప్రభావం తీవ్రంగా పడింది. ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పలు హోటల్స్ యాజమానులు ముస్లింలకు రూమ్‌లు ఇవ్వబోము అని బహిరంగంగా చెప్పడం. అయితే, తాజాగా.. 'ది కశ్మీర్ ఫైల్' మరో సంచలన ఘటనకు కారణమైంది. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా బెహ్రార్ ప్రాంతానికి చెందిన రాజేశ్ కుమార్ మేఘవాల్ అనే దళిత వ్యక్తి ఇటీవల 'ద కశ్మీర్ ఫైల్' చిత్రాన్ని వీక్షించాడు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని ఫేస్‌బుక్ వేదికగా పోస్టు పెట్టి తెలిపాడు.
దీనిపై కొందరు వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, రాజేశ్ కుమార్ పోస్టు కింద వివాదాస్పదంగా కామెంట్లు పెట్టారు. దానితో సరిపోదని భావించిన మరికొంతమంది రాజేశ్ కుమార్‌ను గుడికి రప్పించి, ముక్కు నేలకు రాయించి క్షమాపణలు చెప్పించారు. తప్పు ఒప్పుకోవాలంటూ బలవంతంగా ముక్కు నేలకు రాయించారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం బాధితుడు రాజేశ్ కుమార్ బెహ్రార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ సంఘటనకు బాధ్యులైన 11 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు.